పాన్ ఇండియా ప్రేమకథగా విజయ్-శివ నిర్వాణ మూవీ?

Published on Feb 26, 2022 3:03 am IST

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “లైగర్”. పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 25వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమా తరువాత శివ నిర్వాణ, సుకుమార్ లతో విజయ్ తన తదుపరి సినిమాలు చేయనున్నాడు.

అయితే ఇందులో శివ నిర్వాణ ప్రాజెక్టు ముందుగా పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయని, ఇది ఓ ప్రేమకథా చిత్రమని అంటున్నారు. అయితే ఈ సినిమాను కూడా పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారట. ఇక ఇందులో విజయ్ సరసన నటించేందుకు కియారా అద్వానీని తీసుకున్నట్టుగా టాక్ నడుస్తుంది.

సంబంధిత సమాచారం :