అది ఒక్కటే నా జీవిత ఆశయం – విజయ్ దేవరకొండ

Published on Nov 8, 2021 12:01 am IST

ఆనంద్ దేవరకొండ హీరోగా గీత్ సైని హీరోయిన్‌ గా రాబోతున్న సినిమా ‘పుష్పక విమానం’. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు దామోదర రూపొందించాడు. హీరో విజయ్ దేవరకొండ సమర్పణలో ‘కింగ్ అఫ్ ది హిల్’ ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్లపై గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి , ప్రదీప్ ఎర్రబెల్లిలు ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు విజయ్ దేవరకొండ హాజరయ్యాడు.

కాగా ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘మీరు మా మీద చూపిస్తున్న లవ్ అండ్ సపోర్ట్ వల్లే ఇవాళ ఇక్కడున్నాం. ఫిల్మ్ ప్రొడక్షన్ అనేది చాలా కష్టం. అయితే కొత్తవాళ్లను ఎంకరేజ్ చేసేందుకు ప్రొడక్షన్ లోని కష్టాలు పడిన పర్వాలేదు అనిపిస్తోంది. ఇక మీ అభిమానం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో పుష్పక విమానం ప్రీ రిలీజ్ వేడుకను వైజాగ్ తీసుకొచ్చాము. సినిమా చాలా బాగుంటుంది. మీరంతా చూడండి.

దర్శకుడు దామోదర చాలా టాలెెంటెడ్ టెక్నీషియన్. ఆనంద్ ను చిట్టిలంక సుందర్ క్యారెక్టర్ లో ముందు ఊహించలేకపోయాను. కానీ అతను పర్మార్మ్ చేసి చూపించాడు. నటించడం ఒక్కటే కాదు ప్రొడక్షన్ లో, ప్రమోషన్ లో అన్నింట్లో తాను ఇన్వాల్వ్ అయి సూపర్ సినిమా తీసుకొచ్చాడు. శాన్వీ మేఘన, గీత్ సైని లకు హీరోయిన్స్ గా మంచి పేరొస్తుంది. మీ అభిమానం ఎప్పుడూ కావాలని కోరుకుంటా. మీకు మంచి సినిమాలు, కొత్త తరహా చిత్రాలు చేయాలనేది ఒక్కటే నా జీవిత ఆశయం’ అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :