అందరి ఆశీస్సులు ఉన్నాయి. సినిమా ను ఎవరు ఆపుతారో చూస్తా?…బాయ్ కాట్ లైగర్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ

Published on Aug 23, 2022 3:00 am IST

యువ నటుడు విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్ పై దేశవ్యాప్తంగా ప్రస్తుతం భారీ స్థాయిలో హైప్ ఉంది. ముఖ్యంగా రౌడీ ఫ్యాన్స్ మాత్రమే కాదు, అటు సాధారణ ఆడియన్స్ సైతం లైగర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ట్రైలర్, సాంగ్స్, టీజర్ లైగర్ పై మరింతగా అంచనాలు ఏర్పరచడంతో భారీ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ తప్పకుండా అందరి అంచనాలు అందుకుంటుందని అంటోంది యూనిట్.

ఇక ఈ మూవీ పై ఇటీవల బాయ్ కాట్ లైగర్ పేరుతో కొందరు సోషల్ మీడియా మాధ్యమాల్లో నెగటివ్ ట్రెండ్ చేయడంతో దానిపై నేడు గట్టిగా స్పందించిన హీరో విజయ్ దేవరకొండ, నాకు మా అమ్మ గారి ఆశీర్వాదం, ప్రజల ప్రేమాభిమానాలతో పాటు దేవుడి కృప, మరీ ముఖ్యంగా గెలవాలనే ఫైర్ లోపల ఉంది. ఇక మమ్మల్ని ఎవరు ఆపుతారో చూస్తాను అంటూ బలమైన కౌంటర్ ఇచ్చారు. అనన్య పాండే హీరోయిన్ గా నటించిన పాన్ ఇండియన్ మూవీ లైగర్ ని డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించగా పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలపై ఈ మూవీ రూపొందింది. కాగా ఈ ప్రతిష్టాత్మక మూవీని ఆగష్టు 25న పలు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :