రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘రణబాలి’పై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అందరికీ తెలిసిందే. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ బజ్ క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.
అయితే, ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ తాజాగా ఓ క్రేజీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో రణబాలి వీర తిలకం దిద్దుకుంటున్నట్లు చూపెట్టారు. దీంతో యుద్ధానికి బయల్దేరే ముందు హీరో ఇలా వీర తిలకం దిద్దుకుంటున్నాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ పోస్టర్‌పై అక్టోబర్ 16 రిలీజ్ అంటూ మరోసారి మేకర్స్ రిలీజ్ డేట్‌ను కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రం మాతృభూమి రక్షణ కోసం, తన ప్రజల కోసం పోరాడే ఒక వీరుడి పవర్‌ఫుల్ కథగా రూపొందుతోంది.
మైత్రీ మూవీ మేకర్స్, టి-సిరీస్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిమిస్తున్న ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్న ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
