మెగాస్టార్‌కి ఫుల్ సపోర్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..!

మెగాస్టార్‌కి ఫుల్ సపోర్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..!

Published on Jan 15, 2022 12:02 AM IST

తెలుగు సినీ పరిశ్రమ కోసం, థియేటర్ల మనుగడ కోసం చర్చించేదుకై సినీ ఇండస్ట్రీ బిడ్డగా నిన్న మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కానీ ఈ అంశాన్ని పక్కదోవ పట్టిస్తూ చిరంజీవికి వైసీపీ రాజ్యసభ సీటును ఆఫర్ చేసిందని వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ వార్తలపై సోషల్ మీడియా వేదికగా చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేను మళ్ళీ రాజకీయాలలోకి, చట్టసభలకు రావటం జరగదని, దయచేసి ఊహాగానాలని వార్తలుగా ప్రసారం చేయవద్దని, ఈ వార్తలకి, చర్చలకు ఇప్పటితో ఫుల్‌స్టాప్‌ పెట్టాలని చిరంజీవి ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. అంతేకాదు దీనికి #GiveNewsNotViews అనే హ్యాష్ ట్యాగ్‌ని కూడా జోడించారు.

అయితే చిరంజీవి పెట్టిన #GiveNewsNotViews హ్యాష్ ట్యాగ్‌కి రౌడీ హీరో విజయ్ దేవరకొండ మై ఫుల్ సపోర్ట్ అంటూ మద్ధతు తెలుపుతూ ట్వీట్ చేశాడు. గతంలో విజయ్ దేవరకొండ తనపై తప్పుడు వార్తలను ప్రచారం చేసిన ఓ వెబ్ మీడియాపై సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఇండస్ట్రీలో చాలా మంది విజయ్‌కి మద్ధతు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు