హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో VD12 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ పవర్‌ఫుల్ కాప్ పాత్రలో నటిస్తాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
అయితే, విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘పెళ్లిచూపులు’ సినిమా డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌తో మరోసారి చేతులు కలుపబోతున్నట్లుగా తెలుస్తోంది. ‘పెళ్లిచూపులు’ సినిమాతో హీరోగా విజయ్ సాలిడ్ సక్సెస్ అందుకుని, అటుపై స్టార్ హీరోగా మారాడు. ఇక దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా ఆ సినిమా తరువాత చాలా సినిమాలు చేస్తూ తనదైన రూటులో వెళ్తున్నాడు. ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాను విజయ్ దేవరకొండతో తెరకెక్కించాలని తరుణ్ భాస్కర్ ప్లాన్ చేస్తున్నాడట.
దీనికోసం ఇప్పటికే కథను కూడా రెడీ చేశాడని.. విజయ్‌కి కథను వినిపించగా, ఆయన దానికి ఓకే కూడా చెప్పాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రానుందనే టాక్ సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.