‘క‌ల్కి’లో విజ‌య్ దేవ‌రకొండ అలా కనిపిస్తాడా..?

‘క‌ల్కి’లో విజ‌య్ దేవ‌రకొండ అలా కనిపిస్తాడా..?

Published on Jun 11, 2024 12:30 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ లేటెస్ట్ సెన్సేష‌న్ ‘క‌ల్కి 2898 AD’ కోసం ప్రేక్ష‌కులు ఎంత ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారో ప్ర‌త్యేకించి చెప్పక్క‌ర్లేదు. ఈ ప్రెస్టీజ‌య‌స్ మూవీని నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తుండ‌గా, పూర్తి సైన్స్ ఫిక్ష‌న్ మూవీగా ఇది రానుంది. ఇక ఈ సినిమా ట్రైల‌ర్ మ‌రికాసేప‌ట్లో రిలీజ్ అవుతుండ‌టంతో ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు నెలకొన్నాయి.

కాగా, ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా ఓ పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, ఆయ‌న చేసేది ఓ కేమియో పాత్ర అని కొందరు.. కాదు ఫుల్ లెంగ్త్ రోల్ అని కొంద‌రు వాదిస్తున్నారు. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ పాత్ర‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ అర్జునుడిగా క‌నిపిస్తాడ‌ట‌.

మ‌హాభార‌తంలోని అర్జునుడి పాత్ర నుండి ఈ పాత్ర‌ను స్ఫూర్తిగా తీసుకున్నారట మేక‌ర్స్. అయితే, ఈ విష‌యంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక మ‌రో హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ కూడా ఈ సినిమాలో న‌టిస్తుండ‌టంతో, ఆయ‌న పాత్ర ఏమై ఉంటుందా అనే చ‌ర్చ సాగుతోంది. ఈ సినిమాలో క‌మ‌ల్ హాస‌న్, అమితాబ్ బ‌చ్చ‌న్, దీపికా ప‌దుకొనే, దిశా ప‌టాని, మృణాల్ ఠాకూర్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాను జూన్ 27న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు