“లైగర్” తో విజయ్ దేవరకొండ హిస్టరీ రిపీట్.!

Published on Dec 18, 2021 2:01 am IST

మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు నటిస్తున్న భారీ సినిమా “లైగర్”. డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియన్ లెవెల్లో సాలిడ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుస్తుంది. పాన్ ఇండియన్ నుంచి వరల్డ్ లెవెల్ క్యాస్టింగ్ తో రెడీ అవుతున్న ఈ సినిమా ని నిన్ననే మేకర్స్ రిలీజ్ డేట్ ని అలాగే ఈ డిసెంబరు 31న ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

అయితే ఇక్కడ నుంచే ఆల్రెడీ లైగర్ పై హిట్ వైబ్స్ స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఈ సినిమాని కూడా విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అలాగే తన కెరీర్ కి బ్రేక్ పాయింట్ అయినటువంటి అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయ్యిన డేట్ ఆగష్టు 25 నే రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చెయ్యడంతో ఇక మళ్ళీ అర్జున్ రెడ్డి హిట్ హిస్టరీ తాను రిపీట్ చేస్తాడని ఓ టాక్ వైరల్ అవుతుంది. ఆల్రెడీ సినిమా అవుట్ పుట్ పట్ల మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి నిజంగానే విజయ్ అర్జున్ రెడ్డి లాంటి సాలిడ్ హిట్ కొట్టి హిస్టరీ రిపీట్ చేస్తాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :