లేడీ డైరెక్టర్ తో ‘పెళ్లి చూపులు’ హీరో !

Vijay-Devarakonda
ఈమధ్య కాలంలో ‘పెళ్లి చూపులు’ క్రియేట్ చేసినంత సంచలనం మరే సినిమా క్రియేట్ చెయ్యలేదు. చిన్న సినిమాగా వచ్చి అతిపెద్ద హిట్ గా నిలిచిన ఈ చిత్రంలోని నటీనటులకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. సినిమాలో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో ‘విజయ్ దేవరకొండ’ కు అయితే వరుస అవకాశాలొస్తున్నాయి.

తాజాగా రొమాంటిక్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే లేడీ డైరెక్టర్ ‘నందినీ రెడ్డి’ త్వరలో మొదలుపెట్టబోయే సినిమాలో విజయ్ హీరోగా ఫిక్సయ్యాడు. మొదట నందినీ రెడ్డి స్క్రిప్ట్ వినిపించగానే అది నచ్చి విజయ్ మరో ఆలోచన లేకుండా సినిమా చేయడానికి ఒప్పేసుకున్నాడట. ఈ చిత్రంలో అతని పక్కన ‘ఎవడె సుబ్రహ్మణ్యం, కళ్యాణ వైభోగమే’ ఫేమ్ ‘మాళవికా నాయర్’ హీరోయిన్ గా నటించనుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మిస్తోంది.