పవన్ తో గొంతుకలిపిన దేవరకొండ

విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా నల్లమల అడవిలో కేంద్రం చేపట్టనున్న యురేనియం తవ్వకాలపై స్పందించారు. ఇలాంటి తవ్వకాలు బయో డైవర్సిటీని నాశనం చేస్తాయని, ఇప్పటికే నదులను, వాతావరణాన్ని కలుషితం చేశాం అని, అందుకే ఒక చోట అతివృష్టి, మరొక చోట అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయని ఆయన వేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నల్లమలలో యురేనియం తవ్వకాలు జరపాలన్న ఆలోచన కేంద్రం విరమించుకోవాలని ఆయన పరోక్షంగా చెప్పడం జరిగింది.

ఇదే విషయం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిరోజులుగా పోరాటం సాగిస్తున్నారు. సేవ్ నల్లమల పేరిట యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఆయన గళం విప్పారు. ఈ విషయంలో ఆంధ్రా తెలంగాణా లోని అన్ని పార్టీలు కలసి రావాలంటూ పిలుపునిచ్చారు. ఇప్పుడు ఆయనకు మద్దతుగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా స్పందించి పరోక్షంగా ఆయన ఉద్యమానికి మద్దతు పలికారు.