సూపర్ : విజయ్ ‘లైగర్’ కి నయా పవర్

సూపర్ : విజయ్ ‘లైగర్’ కి నయా పవర్

Published on Aug 18, 2022 10:00 PM IST

విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న లైగర్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన విషయం తెలిసిందే. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, కరణ్ జోహార్ నిర్మించిన ఈ మూవీకి పూరి దర్శకత్వం వహించగా అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ట్రైలర్, టీజర్, సాంగ్స్ విడుదల తరువాత అందరిలో భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచిన లైగర్, ఆగష్టు 25న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ మూవీ యొక్క ఫ్యాన్డం టూర్స్ నిర్వహిస్తోంది యూనిట్.

అయితే విశేషమేమిటంటే, లైగర్ కి ట్విట్టర్ లో స్పెషల్ గా నేడు ఎమోజిస్ ని విడుదల చేసారు. ఫ్యాన్స్, ఆడియన్స్ లో లో మరింత జోష్ నింపేలా #Liger #LigerHuntBegins #WaatLagaDenge హ్యాష్ ట్యాగ్స్ ప్రస్తుతం లైగర్ ఎమోజిస్ తో ట్విట్టర్ లో దూసుకెళ్తున్నాయి. మరోవైపు విజయ్ ఫ్యాన్స్, ఆడియన్స్ అందరూ కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తుండగా త్వరలో మూవీ యొక్క టికెట్ బుకింగ్స్ ని ఓపెన్ చేయనున్నారు. ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్ ని ఓపెన్ చేయగా వాటికి మంచి స్పందన లభించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు