అక్కడ సూపర్ రెస్పాన్స్ తో “ఖుషీ”

Published on Sep 5, 2023 3:01 am IST

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఖుషీ. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం యూఎస్ లో కూడా సాలిడ్ వసూళ్లు రాబడుతోంది. ఇప్పటి వరకూ ఈ చిత్రం అక్కడ 1.5 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టడం జరిగింది.

ఈ చిత్రం లాంగ్ రన్ లో భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి హేషం అబ్ధుల్ వహాబ్ సంగీతం అందించారు. ఈ చిత్రం సక్సెస్ సాధించడం పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం :