లవ్ స్టోరీ తో మొదలు కానున్న విజయ్ దేవరకొండ “AVD సినిమాస్”

Published on Sep 20, 2021 6:00 am IST

విజయ్ దేవరకొండ నటుడు గా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఒక సినిమా లో చిన్న పాత్ర నుండి ఇప్పడు పాన్ ఇండియా హీరో గా అయ్యారు. ఈ మేరకు విజయ్ దేవరకొండ ఏషియన్ విజయ్ దేవరకొండ సినిమాస్ అంటూ మహబూబ్ నగర్ లో ప్రారంభించ నున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ను ఒకటి సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు విజయ్.

అయితే ఈ దియేటర్ లవ్ స్టోరీ చిత్రం తో మొదలు కానుంది. సెప్టెంబర్ 24 వ తేదీన లవ్ స్టోరీ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా తో avd సినిమాస్ మొదలు పెట్టనున్నారు విజయ్. గోవా లో లైగర్ సినిమా షూటింగ్ కారణంగా మల్టీప్లెక్స్ ధియేటర్ ఓపెనింగ్ కి రావడం కుదరడం లేదు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక ఈ మేరకు లవ్ స్టోరీ టీమ్ కి, అందరికీ ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ పాన్ ఇండియా మూవీ లైగర్ లో నటిస్తున్నారు. అనన్య పాండే ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :