“మేజర్” చిత్రం పై విజయ్ దేవరకొండ రెస్పాన్స్!

Published on Jun 7, 2022 9:00 pm IST

అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కిన బయోగ్రాఫికల్ మూవీ మేజర్. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం విడుదల అయిన అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం పై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కామెంట్స్ చేయడం జరిగింది. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదిక గా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

మేజర్ చిత్రం అభిరుచి, ప్రేమ, చిత్తశుద్ది తో చేశారు అని అన్నారు. మనం అందరం చూసి నేర్చుకోవాల్సిన మనిషి, ఒక ట్రూ ఐడల్ అని కొనియాడారు. మన హీరో గురించి తెలుసుకోవాలని అనుకుంటే కచ్చితంగా ఇది చూడండి అంటూ చెప్పుకొచ్చారు విజయ్. అంతేకాక మేజర్ తల్లిదండ్రులకు నా హృదయ పూర్వక గౌరవం మరియు ప్రేమ అని అన్నారు. విజయ్ చేసిన ట్వీట్ కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :