నెక్స్ట్ లెవెల్ లో ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ – విజయ్ దేవరకొండ

Published on Dec 9, 2021 12:29 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రౌద్రం రణం రుధిరం. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ లు నటిస్తున్నారు. డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది.

పలు బాషల్లో విడుదల అయిన ఈ ట్రైలర్ పై సినీ ప్రముఖులు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అర్జున్ రెడ్డి ఫేం విజయ్ దేవరకొండ ట్రైలర్ పై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రౌడ్ గా ఉంది అని, నెక్స్ట్ లెవెల్ సినిమా అంటూ చెప్పుకొచ్చారు. విజయ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం లో అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం :