గ్రాండ్‌గా ప్రారంభమైన విజయ్ దేవరకొండ మల్టీప్లెక్స్..!

గ్రాండ్‌గా ప్రారంభమైన విజయ్ దేవరకొండ మల్టీప్లెక్స్..!

Published on Sep 23, 2021 12:44 AM IST


యంగ్ హీరో విజయ్ దేవరకొండ సినిమాలతోనే కాకుండా బిజినెస్ పరంగా కూడా దూసుకుపోతున్నాడు. ఇప్పటికే రౌడీవేర్, ప్రొడక్షన్ హౌస్, ఎలక్ట్రిక్ వెహికిల్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ ఇప్పుడు థియేటర్ రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. ప్రేక్షకులకు టాప్ క్లాస్ ఎంటర్‌టైన్మెంట్‌ని అందించేందుకు ఏ.వి.డి సినిమాస్ పేరుతో విజయ్ తన సొంత ఊరు మహబూబ్‌నగర్‌లో థియేటర్‌ని ఓపెన్ చేశాడు. డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబిషన్, థియేటర్ రంగాలలో సుదీర్ఘ అనుభవాన్ని సొంతం చేసుకున్న ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంలో విజయ్ దేవరకొండ కలిసి నిర్మించిన ఏవిడి సినిమా మల్టీప్లెక్స్ నేడు ప్రారంభం అయ్యింది.

మూడు థియేటర్స్ సముదాయంగా నిర్మించిన ఈ మల్టీప్లెక్స్ టాప్ క్లాస్ సినిమా అనుభవాన్ని ప్రేక్షకులకు అందించబోతుంది. డాల్బీ అట్మాస్, లగ్జరీ సీటింగ్ వంటి అధునాతన హంగులతో అత్యుత్తమ థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించబోతుంది.

ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ రావు దేవరకొండ మాట్లాడుతూ మేము పుట్టి పెరిగిన చోట ఇలాంటి మల్టీప్లెక్స్ నిర్మాణంలో భాగమవ్వడం చాలా సంతోషంగా ఉందని, విజయ్‌కి ఈ మల్టీప్లెక్స్ చాలా స్పెషల్ ఏషియన్ సునీల్ గారి భాగస్వామ్యం మాకు చాలా ఆనందకరంగా ఉందని అన్నారు.

ఏషియన్ సినిమాస్ అధినేత నారాయణ దాస్ నారంగ్ మాట్లాడుతూ ప్రేక్షకులకు మంచి థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అందించాలనే మహబూబ్‌నగర్‌లో ఏ.వి.డి సినిమాస్‌ను నిర్మించామని, మాతో భాగస్వామ్యం అయిన హీరో విజయ దేవరకొండకు కృతజ్ఞతలు అని, మహబూబ్‌నగర్‌కే కాకుండా చుట్టుపక్కల జిల్లాలకు కూడా ఏ.వి.డి ఎంటర్టైన్మెంట్ హబ్ అవుతుందని అన్నారు.

నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శిరీష్ రెడ్డి మాట్లాడుతూ ఏషియన్ సినిమాస్, విజయ్ దేవరకొండ భాగస్వామ్యంలో నిర్మించిన ఈ ఏ.వి.డి సినిమాస్ చాలా బాగుందని, మంచి థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ని ఆడియెన్స్ ఎప్పుడూ కోరుకుంటారని, ఇప్పుడు వారికి అందుబాటులో ఒక టాప్ క్లాస్ మల్టీప్లెక్స్ ఉందని, ఓ డిస్ట్రిబ్యూటర్‌గా ఇలాంటి థియేటర్ ప్రారంభించడం చాలా సంతోషకరమని అన్నారు.

ఏషియన్ సునీల్ నారంగ్ మాట్లాడుతూ మంచి థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అందించాలనే మా ప్రయత్నంలో హీరో విజయ్ దేవరకొండ భాగస్వామ్యం అయినందుకు కృతజ్ఞతలు అని, ఏ.వి.డి సినిమాస్‌లో ప్రదర్శించే మొదటి సినిమా మా సంస్థలో నిర్మించిన “లవ్ స్టోరి” అవ్వడం చాలా ఆనందంగా ఉందని, మెట్రో సిటీస్‌లో పొందే థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌కి ధీటుగా ఈ మల్టీప్లెక్స్‌ని నిర్మించామని, ఇది తప్పకుండా మహబూబ్‌నగర్‌కి ఎంటర్టైన్మెంట్ హబ్ అవుతుందని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు