2023 లో “ది ర్యాంపేజ్” అంటూ సుక్కు కి లైగర్ స్పెషల్ బర్త్ డే విషెస్

Published on Jan 11, 2022 7:01 pm IST

లెక్కల మాస్టారు సుకుమార్ పుట్టిన రోజు సందర్భంగా సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆ జాబితా లో అర్జున్ రెడ్డి ఫేం విజయ్ దేవరకొండ చేరారు. డైరెక్టర్ సుకుమార్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు విజయ్ దేవరకొండ.

సుకుమార్ సర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు, ఆరోగ్యం గా, సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నా అని అన్నారు. మీతో సినిమా చేసేందుకు ఎదురు చూస్తున్నా అని అన్నారు. అంతేకాక 2021 లో ది రైజ్, 2022 లో ది రూల్, 2023 లో ది ర్యాంపేజ్ అంటూ చెప్పుకొచ్చారు. శుభాకాంక్షలతో పాటుగా విజయ్ డైరెక్టర్ సుకుమార్ తో ఉన్న ఒక ఫోటో ను షేర్ చేయడం జరిగింది. విజయ్ దేవరకొండ తో సుకుమార్ ఒక సినిమా చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప ది రూల్ తర్వాత, సుకుమార్ విజయ్ తో సినిమా మొదలు పెట్టనున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ చిత్రం లో బాక్సర్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :