మహేష్ – సత్తి ల వీడియో పై విజయ్ కామెంట్స్!

Published on May 11, 2022 2:30 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రం మే 12, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల కి సిద్దం అవుతోంది. ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్ లో భాగం గా సూపర్ స్టార్ మహేష్ పలు ఇంటర్వ్యూ లని ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. బిత్తిరి సత్తి తో ఇచ్చిన ఇంటర్వ్యూ లో మహేష్ చాలా సార్లు నవ్వారు.

ట్రైలర్ లోని ఒక డైలాగ్ ను సత్తి అడగడం తో సూపర్ స్టార్ మహేష్ తెగ నవ్వుతూ షో ఇంటర్వ్యూ ఎంజాయ్ చేశారు. మహేష్ స్మైల్ కి గానూ, రౌడీ బాయ్, లైగర్ విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. ఐ లవ్ థిస్ వీడియో అంటూ చెప్పుకొచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :