ప్రియమణి “భామా కలాపం” ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ!

Published on Jan 30, 2022 1:50 pm IST


ప్రియమణి ప్రధాన పాత్రలో అభిమన్యు దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం భామా కలాపం. భరత్ కమ్మ సమర్పణ లో SVCC డిజిటల్ ప్రొడక్షన్ హౌజ్ పై ఈ చిత్రాన్ని బాపినీడు, సుధీర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డైరెక్ట్ డిజిటల్ గా ఆహా వీడియో లో ఫిబ్రవరి 11 వ తేదీన విడుదల కానుంది.

ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు సినిమా పై ఆసక్తి ను పెంచేశాయి. ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను చిత్ర యూనిట్ త్వరలో నిర్వహించనుంది. రేపు జరగనున్న ట్రైలర్ విడుదల కార్యక్రమం కి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. లైగర్ చిత్రం టీజర్ తో సినీ పరిశ్రమ ను ఆకర్షించిన విజయ్ ఈ వేడుక కి హాజరు కానుండటం తో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :