విజయ్ “లైగర్” కి గట్టిగా ప్లాన్ చేస్తున్న మేకర్స్!

Published on Jun 23, 2022 12:00 am IST

యంగ్ అండ్ టాలెంటెడ్ టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్ టైనర్ లైగర్. ధర్మ ప్రొడక్షన్స్ మరియు పూరి కనెక్ట్స్ పతాకాల పై కరణ్ జోహార్, పూరి జగన్నాథ్, ఛార్మి, అపూర్వ మెహతా, హిరో యశ్ జోహార్ లు ఈ చిత్రాన్ని సంయుక్తం గా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా, విక్రమ్ మంట్రోజ్ మరియు తనిష్క్ బఘ్చి లు సంగీత దర్శకులు గా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు విడుదలై ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ చిత్రం ను ఆగస్ట్ 25, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. త్వరలో ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ ను గట్టిగా మొదలు పెట్టే అవకాశం ఉంది. తాజాగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదిక గా చేసిన పోస్ట్ వైరల్ గా మారుతోంది. నేను మీ మాట వింటున్నాను అని తెలుసుకో, మీ మ్యాన్ కి ఎల్లప్పుడూ ఒక ప్రణాళిక ఉంది అని, 10 అంటూ చెప్పుకొచ్చారు. అయితే జూలై 10 నుండి సినిమా ప్రమోషన్స్ ను షురూ చేసే అవకాశం ఉంది.

ఈ చిత్రం లో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూట్ అనన్య పాండే నటిస్తుండగా, రమ్య కృష్ణ, రోనిత్ రాయ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ ఫస్ట్ టైమ్ బాక్సర్ గా నటిస్తుండటం తో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :