రౌడీ బాయ్స్ నుండి “ప్రేమే ఆకాశం” ను విడుదల చేయనున్న విజయ్!

Published on Oct 19, 2021 9:38 am IST

ఆశిష్ రెడ్డి, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తూ, శ్రీ హర్ష కొనుగంటీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం రౌడీ బాయ్స్. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని దిల్ రాజు మరియు శిరీష్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ శరవేగంగా జరుపుతోంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన మరొక లిరికల్ సాంగ్ విడుదల పై క్లారిటీ వచ్చింది.

ఈ చిత్రం నుండి ప్రేమే ఆకాశం అనే పాటని రేపు సాయంత్రం విడుదల చేస్తున్నట్లు చిత్త యూనిట్ ప్రకటించడం జరిగింది. విజయ్ దేవరకొండ ఈ పాటను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా కి సంగీతం దేవీ శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More