కల్ట్ ఫిల్మ్ విత్ కల్ట్ పీపుల్…మెమరబుల్ మూమెంట్స్ షేర్ చేసిన విజయ్ దేవరకొండ!

Published on Jun 30, 2022 7:46 pm IST


విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా, లైగర్. ఈ చిత్రం లో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. నేడు మైక్ టైసన్ పుట్టిన రోజు సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ పలు ఫోటోలను షేర్ చేయడం జరిగింది. మేకింగ్ కల్ట్ ఫిల్మ్ విత్ కల్ట్ పీపుల్ అంటూ విజయ్ దేవరకొండ మైక్ టైసన్ తో ఉన్న ఫోటో లను షేర్ చేశారు.

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం లో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం లో బాహుబలి ఫేం రమ్య కృష్ణ కీలక పాత్ర లో నటిస్తుంది. ఆగస్ట్ 25, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ పాన్ ఇండియా మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :