‘లైగర్’ రీషూట్ అవాస్తవం.. అవుట్ ఫుట్ బాగుందట !

Published on Nov 1, 2021 7:01 am IST

డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘లైగర్’. అయితే, ఈ సినిమా క్లైమాక్స్ ను రీషూట్ చేస్తున్నారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. ‘లైగర్’ క్లైమాక్స్ అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని.. రీషూట్ అంటూ వస్తోన్న వార్తలు పూర్తి అవాస్తవం అని తెలుస్తోంది.

ఇక ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. లైగర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యాడు. ఇక విజయ్ దేవరకొండ చాలా రోజుల నుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More