టీజర్ తో ఆకట్టుకుంటున్న ‘ద గర్ల్ ఫ్రెండ్’

టీజర్ తో ఆకట్టుకుంటున్న ‘ద గర్ల్ ఫ్రెండ్’

Published on Dec 9, 2024 11:46 AM IST

రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘ద గర్ల్ ఫ్రెండ్’. ప్రముఖ నటుడు-దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తీస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజ్ అయింది. ఎమోషనల్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమా టీజర్ చాల బాగా ఆకట్టుకుంది. పైగా విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్‌తో ఈ టీజర్ సాగడం విశేషం. ‘నీకని మనసుని రాసిచ్చేసా.. పడ్డానేమో ప్రేమలో బహుశా’ అని విజయ్ దేవరకొండ చెబుతుంటే.. స్క్రీన్‌పై రష్మిక విజువల్స్ చాలా బాగున్నాయి. మొత్తానికి టీజర్ సినిమా పై అంచనాలను మరింతగా పెంచింది.

ముఖ్యంగా టీజర్ మొత్తం రష్మిక క్లోజప్ షాట్స్ కనిపించాయి. మొత్తానికి ఈ మూవీలో రష్మిక యాక్టింగ్ అదరగొట్టేయబోతుందనిపిస్తోంది. కాగా ‘ద గర్ల్ ఫ్రెండ్’ సినిమాని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక హేసమ్ అబ్దుల్ సంగీతమందించగా.. ‘దసరా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి.. రష్మికకు జోడిగా కనిపించబోతున్నాడు. బహుశా ఫిబ్రవరిలో ఈ మూవీ రిలీజ్ ఉండొచ్చు అని టాక్ వినిపిస్తోంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు