విజయ్ దేవరకొండ “ఖుషీ” ఫస్ట్ సింగిల్ అనౌన్స్ మెంట్ కి టైమ్ ఫిక్స్!

Published on May 4, 2023 1:56 pm IST

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఖుషీ. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రాగా, మ్యూజికల్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారు.

తాజాగా ఫస్ట్ సింగిల్ పై మేకర్స్ అనౌన్స్ మెంట్ చేయడం జరిగింది. ఫస్ట్ సింగిల్ కి సంబంధించిన అనౌన్స్ మెంట్ ను ఈ రోజు సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నారు. హేషం అబ్దుల్ వాహాబ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :