విజయ్ – సమంత ల “ఖుషీ” రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Mar 23, 2023 4:03 pm IST


టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషీ చిత్రం విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయినప్పటికీ, అతని పాన్ ఇండియన్ చిత్రం లైగర్ బాక్సాఫీస్ వద్ద అనుకున్న రీతిలో సక్సెస్ కాలేదు.నిన్ను కోరి, మజిలీ వంటి సూపర్‌హిట్‌లను అందించిన శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ కొంతకాలం గ్యాప్ తర్వాత ఇటీవలే పునఃప్రారంభమైంది.

ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 1, 2023న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అదే విషయాన్ని ప్రకటించేందుకు విజయ్ దేవరకొండ, సమంత లతో ఉన్నటువంటి పోస్టర్‌ను ఆవిష్కరించారు. రెండు ప్రపంచాలు సెప్టెంబర్ 1, 2023న కలుస్తాయి అని పోస్టర్ ను రిలీజ్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మురళీ శర్మ, జయరామ్, సచిన్ ఖేడకర్, శరణ్య ప్రదీప్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించనున్నారు.

సంబంధిత సమాచారం :