వైరల్ అవుతోన్న విజయ్ లేటెస్ట్ పోస్ట్!

Published on Nov 22, 2021 10:20 pm IST


విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ యూత్ లో క్రేజ్ సొంతం చేసుకున్నారు. అర్జున్ రెడ్డి చిత్రం తో మొదలైన ఈ క్రేజ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లైగర్. ఈ చిత్రం కోసం విజయ్ గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారు. అంతేకాక ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలకి గుర్రపు స్వారీ కీలకం కానున్నట్లు తెలుస్తోంది.

అయితే విజయ్ దేవరకొండ తాజాగా సోషల్ మీడియా వేదిక గా ఒక పోస్ట్ చేశారు. రైడింగ్ హార్సెస్ అంటూ చెప్పుకొచ్చారు. తనకు గుఱ్ఱాలు అంటే ఇష్టం అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక త్వరలో ఒకదాన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చారు. విజయ్ దేవరకొండ ఒక ఫోటో ను షేర్ చేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గుఱ్ఱపు స్వారీ చేస్తున్న విజయ్ దేవరకొండ ఫోటో కి విపరీతమైన లైక్స్ తో పాటుగా షేర్స్ కూడా వస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

More