విజయ్ “లైగర్” ట్రైలర్ కి మాసివ్ రెస్పాన్స్!

Published on Jul 25, 2022 9:00 pm IST

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా లైగర్. సాలా క్రాస్ బ్రీడ్ ఈ చిత్రానికి క్యాప్షన్. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 25, 2022 న వరల్డ్ వైడ్ గా భారీ థియేట్రికల్ విడుదల కి సిద్దం అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

అయితే ఈ చిత్రం నుండి విడుదల అయిన ట్రైలర్ కి మాసివ్ రెస్పాన్స్ వస్తోంది. విజయ్ తొలి పాన్ ఇండియా సినిమాకే ఈ తరహా రెస్పాన్స్ రావడం విశేషం. ఈ ట్రైలర్ కి ఇప్పటి వరకూ 65 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. విడుదలైన ట్రైలర్ గత నాలుగు రోజుల నుండి యూ ట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రం లో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్, సీనియర్ నటి రమ్య కృష్ణ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :