విజయ్ దేవరకొండ “లైగర్” నుండి బిగ్ అప్డేట్

Published on May 4, 2022 5:35 pm IST

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ మొదటి పాన్ ఇండియా సినిమా లైగర్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బాక్సింగ్ డ్రామాలో అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. తాజా వార్త ఏమిటంటే, మే 9, 2022 సాయంత్రం 4 గంటలకు బిగ్ అప్డేట్ రాబోతోందని మేకర్స్ ప్రకటించారు.

ట్రైలర్ అప్‌డేట్ లేదా సినిమా కి సంబందించిన మరో భీకరమైన లుక్ పోస్టర్‌ ను విడుదల చేసే అవకాశం ఉంది. ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి కనెక్ట్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కూడా కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో విజయ్ తల్లిగా రమ్య కృష్ణన్ నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 25, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :