లైగర్ వరుస అప్డేట్స్…విజయ్ ఫ్యాన్స్ కి అల్టిమేట్ ట్రీట్!

Published on Dec 28, 2021 9:35 pm IST

విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా పాన్ ఇండియా మూవీ లైగర్. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం లో ప్రముఖ లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ నటిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు ఇప్పటికే విడుదల అయి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన అప్డేట్స్ విషయం లో చిత్ర యూనిట్ భారీ ప్లాన్ ను వేయడం జరిగింది. డిసెంబర్ 29 వ తేదీన ఉదయం 10:03 గంటలకు బిగ్ అనౌన్స్ మెంట్ వీడియో ను విడుదల చేయనుంది. అదే విధంగా డిసెంబర్ 30 వ తేదీన ఉదయం 10:03 గంటలు బిటీఎస్ రిలీజ్ మరియు సాయంత్రం 4:00 గంటలకు స్పెషల్ ఇన్ స్టా ఫిల్టర్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే డిసెంబర్ 31 వ తేదీన ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ వరుస అప్డేట్స్ తో లైగర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :