దేవరకొండ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభమైంది !

Vijay Devarakonda
‘పెళ్లి చూపులు, అర్జున్‌ రెడ్డి’ చిత్రాలతో భారీ విజయాలు సాధించి యంగ్ హీరోల్లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాడు విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న విజయ్‌ ‘డియర్‌ కామ్రెడ్‌’ అనే చిత్రాన్ని విజయ్ మైత్రీ మూవీస్‌ సంస్థలో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈరోజే లాంచ్ అయినా ఈ సినిమా షూటింగ్‌ కూడ ఈ రోజే ప్రారంభమైంది.

కాగా ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి క్లాప్‌ కొట్టి చిత్రాన్ని ప్రారంభించారు. ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ సరసన ‘ఛలో’ ఫేమ్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి భరత్‌ కమ్మ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంతో పాటుగా ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ ‘టాక్సీవాలా, గీతా గోవిందం, నోటా’ చిత్రాల్లో కూడా నటిస్తున్నాడు.

Exit mobile version