“విజయ్” దళపతి తెలుగు సినిమాకి ఆ ముహూర్తం ఫిక్స్?

Published on Jan 28, 2022 2:00 am IST

తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ తెలుగు వారికి కూడా సుపరిచితుడే. అయితే విజయ్ తెలుగులో ఓ స్ట్రెయిట్ మూవీ చేసేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా తెరపైకి రానున్న ఈ మూవీని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనుండగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రకటించి చాలా రోజులవుతున్నా ఇంత వరకు దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు.

అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటికి వచ్చేసింది. ప్రస్తుతం విజయ్ ‘బీస్ట్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకోగా, త్వరలో ఈ మూవీని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక వచ్చే నెల ఈ సినిమా డబ్బింగ్ వర్క్ కూడా పూర్తి చేయబోతున్న విజయ్ ఆ తరువాత వంశీ పైడిపల్లితో చేయబోతున్న తెలుగు ప్రాజెక్ట్ కోసం తన డేట్స్ ని కేటాయించబోతున్నాడని తెలుస్తుంది.

తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో రూపొందనున్న ఈ ద్వి భాష చిత్రాన్ని వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని వంశీ పైడిపల్లి ప్లాన్ చేస్తున్నాడట. నిర్మాత దిల్ రాజు కూడా ఈ మూవీని త్వరగా ప్రారంభించాలని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ని వచ్చే నెల లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించి మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని నిర్ణయించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :