“బీస్ట్” సినిమా నచ్చలేదని థియేటర్‌కి నిప్పంటించిన ఫ్యాన్స్..!

Published on Apr 13, 2022 3:00 pm IST

తమిళ సూపర్ స్టార్ విజయ్, పూజాహెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “బీస్ట్”. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాలతో నేడు విడుదల అయ్యింది. అయితే ఈ సినిమాకి మిశ్రమ స్పందన రావడంతో విజయ్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.

తమ అభిమాన హీరో సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడాన్ని తట్టుకోలేకపోయిన కొందరు విజయ్ అభిమానులు తమిళనాడులోని ఓ థియేటర్‌లో స్క్రీన్‌కు నిప్పంటించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. సినిమా అన్నాక ఇలాంటివి సర్వ సాధారణం.. అంత మాత్రానా ఇలా థియేటర్‌కి నిప్పంటిస్తారా అని ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు మండిపడుతున్నారు.

సంబంధిత సమాచారం :