తెలుగులో రీ రిలీజ్ కాబోతున్న విజయ్ హిట్ సినిమా.!

తెలుగులో రీ రిలీజ్ కాబోతున్న విజయ్ హిట్ సినిమా.!

Published on Dec 1, 2022 3:40 PM IST

గత కొన్నాళ్ల నుంచి టాలీవుడ్ కొత్త ట్రెండ్ స్టార్ట్ అయ్యిన సంగతి తెలిసిందే. కొత్త పాత చిత్రాలు కొన్ని స్పెషల్ షోలు రీ రిలీజ్ లతో అభిమానులు అయితే వేయించుకుంటున్నారు. అయితే ఇది మన టాలీవుడ్ సినిమాల నుంచి ఎక్కువగా కనిపిస్తుండగా లేటెస్ట్ గా అయితే తెలుగులో తమిళ హీరో విజయ్ నటించిన భారీ హిట్ చిత్రం “అదిరింది” రిలీజ్ కి రెడీ కాబోతుంది.

దళపతి విజయ్ సినీ ఇండస్ట్రీ లో అడుగు పెట్టి 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అయితే హైదరాబాద్ సుదర్శన్ లో ఈ డిసెంబర్ 4 న సాయంత్రం 6 గంటలకి స్పెషల్ షో ప్లాన్ చేశారు. మరి దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని అయితే దర్శకుడు అట్లీ తెరకెక్కించగా సమంత మరియు కాజల్ లు హీరోయిన్స్ గా నటించారు. అలాగే ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు