క్లైమాక్స్ ఘాట్ కి ‘విజయ్’ సన్నాహాలు !

క్లైమాక్స్ ఘాట్ కి ‘విజయ్’ సన్నాహాలు !

Published on Jan 20, 2025 7:06 AM IST

విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాబోతున్న సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే.. వచ్చే వారంలో రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో ఈ సినిమా క్లైమాక్స్ ను ఘాట్ చేస్తారట. ఈ క్లైమాక్స్ కోసం విజయ్ దేవరకొండ కొన్ని స్టంట్స్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడట. క్లైమాక్స్ ఘాట్ అనంతరం బ్యాలెన్స్ సాంగ్ షూట్ ను చిత్రీకరిస్తారని తెలుస్తోంది.

కాగా ఈ సినిమా షూటింగ్ 90% పూర్తి అయింది. అన్నట్టు ఈ చిత్రంలో విజయ్ రగ్గుడ్ మాస్ లుక్ లో కనిపించనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాకి సాలిడ్ సీక్వెల్ ఉన్నట్టుగా ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కాబట్టి, ఈ సినిమా మొదటి పార్ట్ 1 అద్భుత విజయం సాధించాలి. మరి ఈ సినిమా టీజర్, గ్లింప్స్ లాంటివి త్వరలోనే రానున్నాయి. అవి ఎలా ఉంటాయో చూడాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు