అఫీషియల్ : వాయిదా పడ్డ విజయ్ ‘జన నాయగన్’.. నిరాశలో ఫ్యాన్స్..!

Jana Nayagan

దళపతి విజయ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan) విడుదలపై నెలకొన్న కన్ఫ్యూజన్‌కు తెరపడింది. సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా, విడుదలకు కొద్ది గంటల ముందు వాయిదా పడింది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమైనప్పటికీ, సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికేట్ రాకపోవడంతో ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

సెన్సార్ ప్రక్రియకు సంబంధించిన న్యాయపరమైన వ్యవహారాలు కొనసాగుతుండటమే ఈ ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది. ఈ కేసుకు తుది తీర్పు కూడా జనవరి 9న రావచ్చని సమాచారం. అదే రోజు సినిమా విడుదల తేదీ కావడంతో, అప్పటివరకు క్లారిటీ రాకపోతే విడుదల సాధ్యం కాదని మేకర్స్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ ప్రకటనతో తమిళ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జన నాయగన్’ (Jana Nayagan) దళపతి విజయ్ చివరి సినిమా కావడమే ఈ నిరాశకు కారణం. ఈ సినిమాను మొదట దీపావళి 2025కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా కొన్ని కారణాల వల్ల సంక్రాంతి 2026కి మార్చారు. ఇప్పుడు మరోసారి ఈ చిత్రం వాయిదా పడటంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తుండగా, టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’ చిత్రానికి ఇది రీమేక్ కావడం గమనార్హం.

Exit mobile version