
విజయ నిర్మల మనవడు, సీనియర్ హీరో నరేష్ తనయుడు విజయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతుంది. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్. హీరో హీరోయిన్లతో పాటు ప్రధాన తారాగణం నాగబాబు, రాహుల్ దేవ్, చాందిని పాల్గొనగా క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇదే చివరి షెడ్యూల్. మరో రెండు ఎపిసోడ్లలో షూటింగ్ కంప్లీట్ చేయనున్నాం అని దర్శకుడు తెలిపారు.
హీరోగా నవీన్ ఈ సినిమాతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంటాడని కోరుకుంటున్నాను. షూటింగ్ చివరి దశలో ఉంది. ఫిబ్రవరి నెలాఖరున టైటిల్ ప్రకటిస్తాం. మార్చి 10వ తేదీన సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అని నిర్మాత అడ్డాల చంటి తెలిపారు. రామ్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అడ్డాల ధనలక్ష్మి సమర్పణలో ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై అడ్డాల చంటి నిర్మిస్తున్నారు. అచ్చు ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.