సెకండ్ సింగిల్ రిలీజ్ కి రెడీ అవుతోన్న విజయ్ ‘లియో’ ?

Published on Sep 13, 2023 6:00 pm IST

ఇళయదళపతి విజయ్ హీరోగా యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ లియో. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో అర్జున్ సర్జా, సంజయ్ దత్ కీలక పాత్రలు చేస్తుండగా అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో సంస్థ పై గ్రాండ్ గా తెరకెక్కుతున్న లియో పై విజయ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ అందరినీ ఆకట్టుకోగా అతి త్వరలో సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. కాగా వినాయక చవితి సందర్భంగా ఈ సాంగ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నాయి సినీ వర్గాలు. కాగా లియో మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి అక్టోబర్ 19న గ్రాండ్ గా థియేటర్స్ లోకి తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం :