త్రిష కి ‘లియో’ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

Published on May 4, 2023 8:56 pm IST


టాలీవుడ్ తో పాటు అటు కోలీవుడ్ లో కూడా స్టార్ నటిగా పలు సక్సెస్ఫుల్ సినిమాల్లో తన ఆకట్టుకునే అందం, అభినయంతో ఎందరో ప్రేక్షకాభిమానుల మనసు దోచారు స్టార్ నటి త్రిష. ఇక ఇటీవల పొన్నియన్ సెల్వన్ రెండు పార్ట్స్ లో కుందవై పాత్రతో మరొక్కసారి అందరినీ అలరించిన త్రిష నేడు తన 40వ పుట్టిన రోజుని జరుపుకుంటుండగా పలువురు ప్రేక్షకాభిమానులు ఆమెకు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.

కాగా కొద్దిసేపటి క్రితం ఇళయదళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న లియో మూవీ టీమ్ ఆమెకు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే లియో మూవీ అటు హీరోగా విజయ్ కి అలానే ఇటు హీరోయిన్ గా త్రిష కి 67వ మూవీ కావడం. కాగా ఈ మూవీని అక్టోబర్ 19న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :