ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీ లియో. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీలో సంజయ్ దత్, అర్జున్ కీలక పాత్రలు చేస్తుండగా సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. తమిళనాడుతో పాటు పలు ఇతర ప్రాంతాల ఆడియన్స్ లో కూడా లియో పై భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి.
విషయం ఏమిటంటే, తాజాగా యుకె లో లియో యొక్క ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేయగా 24 గంటల్లో 10 వేల టికెట్స్ అమ్ముడయ్యాయి. తద్వారా 100 కె పౌండ్స్ అందుకుని ఈ మూవీ. ఆ విధంగా రిలీజ్ కి ముందే లియో మూవీ బుకింగ్స్ తో తన ర్యాంపేజ్ చూపిస్తోంది. అనిరుద్ సంగీతం అందించిన ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ అందరినీ ఆకట్టుకోగా త్వరలో మూవీ నుండి ఒక్కొక్కటిగా అప్ డేట్స్ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు. కాగా లియో మూవీ అక్టోబర్ 19న పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.