బాక్సాఫీస్ వద్ద మహేష్ తో తలపడనున్న విజయ్ దేవరకొండ?

Published on Nov 29, 2021 8:00 pm IST


విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం లైగర్. ఈ చిత్రం లాస్ వెగాస్ లో షూటింగ్ ను పూర్తి చేసుకొనే పనిలో బిజీగా ఉంది. ఈ చిత్రం నుండి చాలా అప్డేట్స్ వస్తున్నప్పటికీ, విడుదల తేదీ పై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ చిత్రం రిలీజ్ డేట్ విషయం లో విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా ను ఏప్రిల్ కి రిలీజ్ చేసే అవకాశం ఉంది వార్తలు వచ్చినా, తేదీ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న మరొక గాసిప్ ఏమిటంటే, ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇదే కానీ జరిగితే విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ మహేష్ తో బాక్సాఫీస్ వద్ద తలపడే అవకాశం ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట అదే రోజున విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న లైగర్ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం లో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :