“వారిసు” స్టేజ్ పై విజయ్ లైవ్ పెర్ఫామెన్స్..వీడియో వైరల్.!

“వారిసు” స్టేజ్ పై విజయ్ లైవ్ పెర్ఫామెన్స్..వీడియో వైరల్.!

Published on Dec 25, 2022 10:01 AM IST

ఇళయ దళపతి విజయ్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “వారిసు” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా నిన్ననే ఈ సినిమా తాలూకా గ్రాండ్ ఆడియో ఈవెంట్ తమిళ నాట జరిగింది. అయితే ఇది లైవ్ టెలికాస్ట్ జరగలేదు కానీ చాలానే సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో ఈ గ్రాండ్ ఈవెంట్ జరిగింది.

ఇక ఈ ఈవెంట్ లోనే విజయ్ కూడా తన ఫ్యాన్స్ కి సూపర్ సర్ప్రైజ్ ని కూడా ఇచ్చాడు. అయితే దీనిపై మాత్రం సినిమాలో సెన్సేషనల్ హిట్ సాంగ్ రంజితమే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎక్స్ క్లూజివ్ వీడియో ని అయితే షేర్ చేయడం వైరల్ గా మారింది. మరి తమిళ్ లో ఈ చార్ట్ బస్టర్ రంజితమే ని స్వయంగా విజయ్ నే పాడిన సంగతి తెలిసిందే.

మరి ఈ సాంగ్ ని అయితే లైవ్ లో వారిసు స్టేజ్ పై ఫ్యాన్స్ కోసం తాను పాడడం జరిగింది. దీనితో ఈ క్రేజీ మూమెంట్ ని అయితే జానీ మాస్టర్ సోషల్ మీడియాలో షేర్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. దీనితో ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

https://twitter.com/AlwaysJani/status/1606715069798420482

సంబంధిత సమాచారం

తాజా వార్తలు