సంక్రాంతికి విజయ్ సినిమా ప్రారంభం !

vijay3

స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘సర్కార్’. ఈ చిత్రంలో విజయ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 6న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా తాజాగా కోలీవుడ్ సినీవర్గాల సమాచారం ప్రకారం విజయ్ తన తరువాతి చిత్రాన్ని కూడా త్వరలో పెట్టాలెక్కించనున్నాడు. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ, విజయ్ తదుపరి చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాతి రోజున లాంఛనంగా ప్రారంభించనున్నారని సమాచారం.

గతంలో విజయ్, అట్లీ కలయికలో వచ్చిన ‘తేరి, మెర్సల్’ సినిమాలు బక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. దీంతో వీరి కాంబినేషన్ లో ఈ సారి రాబోయే చిత్రం కూడా సూపర్ హిట్ అవ్వడం ఖాయం అని, విజయ్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

Exit mobile version