గ్రాండ్ గా లాంచ్ అయ్యిన విజయ్ 66..షూట్ డీటెయిల్స్ ఇవే.!

Published on Apr 6, 2022 3:00 pm IST

ఇళయ థలపతి విజయ్ జోసెఫ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమా “బీస్ట్” రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా అనంతరం తన కెరీర్ లో 66వ సినిమాగా దర్శకుడు వంశీ పైడిపల్లి తో ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని టేకప్ చేసి మొదటిసారిగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నాడు.

విజయ్ అభిమానులు ఎప్పుడు నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఫైనల్ గా ఈరోజు గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. హీరో విజయ్, హీరోయిన్ రష్మికా మందన్నా మరియు నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ సహా సంగీత దర్శకుడు థమన్ తదితరులు హాజరయ్యారు.

మరి అలాగే దిల్ రాజు క్లాప్ తో స్టార్ట్ అయ్యిన ఈ సినిమా షూటింగ్ పై మరో ఇంట్రెస్టింగ్ సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం సినిమా ఐదు రోజులు షూట్ తో మొదలు కానుందట. అంతే కాకుండా ఈ షూట్ ఓ సాంగ్ అని కూడా సినీ వర్గాల్లో టాక్. మరి ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా ఈ క్రేజీ ఆల్బమ్ కోసం కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :