టాక్..విజయ్ “బీస్ట్” కి ఆల్మోస్ట్ రిలీజ్ డేట్ ఇదేనట.!

Published on Feb 6, 2022 3:42 pm IST


ఇళయ థలపతి విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ సినిమా “బీస్ట్”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రాన్ని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ భారీ యాక్షన్ చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా కోసం విజయ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ ఈ చిత్రాన్ని ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు.

అయితే ఇదిలా ఉండగా ఈ చిత్రం రిలీజ్ కి సంబంధించి ఎప్పుడు నుంచో ఆసక్తికర బజ్ వినిపిస్తూనే ఉంది. మరి దీని ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నెల లోనే ఈ చిత్రం రిలీజ్ అవుతుంది అని ఊహాగానాలు వినిపిస్తుండగా ఈ టాక్ నిజమే అని తెలుస్తుంది. మేకర్స్ ఈ చిత్రం రిలీజ్ ని గాను భారీ సినిమా “కేజీయఫ్ చాప్టర్ 2” రిలీజ్ డేట్ ఏప్రిల్ 14నే రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ఫిక్స్ చేశారట. ఇప్పుడు తమిళ్ మీడియా వర్గాలు అయితే ఇదే చెప్తున్నాయి. మరి ఆ టైం కి ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :