భారీ ఓపెనింగ్స్ అందుకున్న విజయ్ “బీస్ట్”.?

Published on Apr 14, 2022 11:00 pm IST


ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ చిత్రం “బీస్ట్” నిన్ననే చాలా గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి ఫస్ట్ డే నే అనుకున్న రేంజ్ మంచి టాక్ మాత్రం రాలేదు. అయితే విజయ్ సినిమాలకి ఓపెనింగ్స్ అంటే ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ అంచనాలకి తగ్గట్టు గానే ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ ని అందుకుంది అని తమిళ మీడియా వర్గాలు చెబుతున్నాయి.

అయితే అధికారిక నంబర్స్ ఇంకా బయటకి రావాల్సి ఉంది కానీ తమిళ నాట అయితే మాత్రం ఆల్ టైం రికార్డు గ్రాస్ నే కలెక్ట్ చేసింది అంటున్నారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా సాలిడ్ నెంబర్ నే నమోదు చేసినట్టుగా కూడా అంటున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాని నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అలాగే అనిరుద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :