ఓటీటీలో వచ్చేసిన “వారసుడు” కానీ మరో సర్ప్రైజ్.!

Published on Feb 22, 2023 7:03 am IST

ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన లేటెస్ట్ క్లీన్ ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం “వారిసు”. మరి ఒరిజినల్ గా తమిళ్ లో తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులో “వారిసు” పేరిట రిలీజ్ అయ్యింది. అయితే ఇక ఆల్ మోస్ట్ థియేట్రికల్ రన్ ని అయితే ముగించుకున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆడియెన్స్ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

మరి ఈ సినిమా అయితే నేటి నుంచి ఎట్టకేలకు ప్రైమ్ వీడియో లో అందుబాటులోకి వచ్చేసింది. అయితే ప్రైమ్ వీడియో వారు మొదట ఈ సినిమాని మూడు భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఈ సినిమా సర్ప్రైజింగ్ గా మొత్తం 4 భాషల్లో ప్రైమ్ వీడియో లో వచ్చింది.

తెలుగు, తమిళ్, మళయాళం సహా కన్నడ లో అయితే వారసుడు ఇప్పుడు అందుబాటులో ఉంది. దీనితో అయితే ఈ సినిమాని అప్పుడు మిస్ అయ్యిన వారు చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :