బాలీవుడ్‌లోకి రీమేక్ అవుతున్న విజయ్ సేతుపతి హిట్ సినిమా..!

Published on Sep 22, 2021 11:55 pm IST


మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘96’ బాలీవుడ్‌లోకి రీమేక్ కాబోతుంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత అజయ్ కపూర్ హిందీలో నిర్మించనున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే దర్శకుడు, నటీనటుల వివరాలను విడుదల చేస్తామని అజయ్ కపూర్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చెప్పుకొచ్చింది.

ఇక ఇప్పటికే తెలుగులోకి రీమేక్ అయిన సంగతి తెలిసిందే. ‘జాను’ అనే టైటిల్‌తో శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. తమిళ వెర్షన్‌కి దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ ఈ సినిమాని కూడా డైరెక్ట్ చేశాడు. అయితే తమిళ్‌లో మెప్పించిన ఈ సినిమా తెలుగులో మాత్రం ఆశించిన సక్సెస్‌ని అందుకోలేకపోయింది.

సంబంధిత సమాచారం :