‘పుష్ప’ పార్ట్ 2లో విజయ్ సేతుపతి ?

Published on Jul 25, 2021 7:18 pm IST

బన్నీ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమాలో ఒక కీలక పాత్ర ఉంది. కాకపోతే పార్ట్ 2 లో ఈ పాత్ర వస్తోందట. అంటే పార్ట్ 2కి లీడ్ అన్నమాట. అయితే ఈ పాత్రలో విజయ్ సేతుపతి నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయ్ నటించాలి.

కానీ డేట్లు కుదరక ఈ సినిమా నుండి విజయ్ సేతుపతి తప్పుకున్నాడు. అయితే, పుష్ప పార్ట్ 2ను కూడా తీసుకురాబోతున్నారు కాబట్టి విజయ్ కోసం ప్రత్యేక రోల్ ను డిజైన్ చేశారు. ఇక ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ ఉంది. ఈ సాంగ్ లో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలా నటిస్తోంది. అలాగే వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న ఈ సినిమాలో ఓ గిరిజన యువతి పాత్రలో నటిస్తోంది.

పుష్ప సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది.

సంబంధిత సమాచారం :