పుష్ప 2లో విజయ్ సేతుపతి.. నటించేది ఆ క్యారెక్టర్ లోనే..!

పుష్ప 2లో విజయ్ సేతుపతి.. నటించేది ఆ క్యారెక్టర్ లోనే..!

Published on Jul 4, 2022 11:00 AM IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం పుష్ప 2 కోసం బన్నీ ఫుల్ బిజీగా ఉన్నాడు. కాగా పుష్ప 2 లో తారాగణం పై అనేక పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మరొక పుకారు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమిళ స్టార్ విజయ్ సేతుపతి పుష్ప 2లో నటించబోతున్నాడట. ఈ మేరకు విజయ్ సేతుపతితో చర్చలు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది.

పుష్ప 2లో మరో సీనియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉందని, ఆ క్యారెక్టర్ లోనే విజయ్ సేతుపతి నటించబోతున్నాడని తెలుస్తోంది. నిజానికి విజయ్ సేతుపతి పుష్ప పార్ట్ 1 లోనే నటించాల్సింది. కానీ, అప్పుడు కుదరలేదు. ఏది ఏమైనా ‘పుష్ప సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉంది. పుష్పరాజ్ లాంటి పాత్రను స్టార్ హీరో చేసి మెప్పించడం చాలా రిస్క్. బన్నీ ఆ రిస్క్ ను బాగా హ్యాండిల్ చేశాడు. పుష్ప 2 కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు